News April 10, 2025
బాపట్లలో ఉచిత DSC కోచింగ్

DSC రిక్రూట్ మెంట్-2025 పరీక్షలకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ కోసం అర్హులైన బాపట్ల జిల్లాకు చెందిన BC, EBC, SC, ST కులాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి గురువారం తెలిపారు. చిన్నగంజాం మండల పరిధిలోని అభ్యర్థులు బాపట్లలో వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు వివరించారు.
Similar News
News December 7, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News December 7, 2025
మీ పిల్లలను ఇలా మోటివేట్ చేయండి

పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. “నా వల్ల కాదు” అని చెప్పే అలవాటు ఉంటే సరైన ప్రోత్సాహంతో దాన్ని మార్చవచ్చు. ఫలితాలకంటే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. “నీవు చేయగలవు”, “మళ్లీ ప్రయత్నించు” అని చెప్తే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. వారికి చిన్నచిన్న నిర్ణయాలు సొంతంగా తీసుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల నమ్మకమే పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అవుతుంది.
News December 7, 2025
VZM: కలెక్టర్ ఆఫీస్లో రేపు పీజీఆర్ఎస్

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవచ్చు అన్నారు.


