News January 30, 2025

బాపట్లలో ఎన్నికల కోడ్ అమలు

image

బాపట్ల పట్టణంలో గురువారం నుంచి ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లు బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి చెప్పారు. గురువారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి పార్టీలకు సంబంధించిన బ్యానర్లు, జెండాలు ఉండరాదని వెంటనే స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు.

Similar News

News February 19, 2025

ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 19, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ

image

కష్టకాలంలో నిలబడ్డవారికి సపోర్ట్ చేయాలని విశాఖ MP శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశానుసారం ప్రస్తుత MLC రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కూడా మద్దతు తెలిపిందని.. బీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. కాగా.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమయంలో TDP బలపరిచిన వేపాడ చిరంజీవి గెలుపులో రఘువర్మ కీలక పాత్ర పోషించారు.

News February 19, 2025

పరిగి: కరెంట్‌ పోల్‌‌కు ఉరేసుకొని సూసైడ్

image

పరిగిలో విషాదం ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. నజీరాబాద్ తండాకు చెందిన భారతి పరిగి మండలం హనుమాన్ గండి సమీపంలో ఉన్న కరెంట్ పోల్‌కు ఉరేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!