News January 24, 2025
బాపట్లలో కళాశాల బస్సు బీభత్సం

చీరాల నుంచి కర్లపాలెం వైపు వస్తున్న ఓ కళాశాల బస్సు శుక్రవారం బీభత్సం సృష్టించింది. సదరు బస్సు బాపట్ల మండలం నందిరాజుతోట వద్ద కూరగాయల బండిని, హైదరుపేట వద్ద బైకును, సత్యవతిపేట వద్ద స్కూటీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకులు దెబ్బతినడంతోపాటు ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 25, 2025
వరస వివాదాల్లో శ్రీశైలం మల్లన్న క్షేత్రం!

శ్రీశైలం మల్లన్న క్షేత్రం వరస వివాదాలతో SMలో వైరల్ అవుతోంది. భద్రతా లోపాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న నిబంధనలకు విరుద్ధంగా ఓ అధికారి వ్యవహారం, ఓ యువతి డాన్స్, నిన్న క్షేత్ర పరిధిలో పేకాట తదితర ఘటనలతో మల్లన్న క్షేత్రం పేరు తెరపైకొస్తుంది. మరోవైపు అర్హతలను మరచి ప్రమోషన్లు ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. ఆ మల్లన్నే శ్రీశైలం క్షేత్రాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.
News December 25, 2025
రేపు బాక్సింగ్ డే.. సెలవు

రేపు (డిసెంబర్ 26) బాక్సింగ్ డే సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దీంతో అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే ఉంది. కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.
News December 25, 2025
FLASH: నార్కట్పల్లిలో యాక్సిడెంట్.. ఛిద్రమైన శరీరం..!

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లూనాపై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని శరీర భాగాలను ఒక చోటికి చేర్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


