News February 26, 2025
బాపట్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

బాపట్ల పట్టణంలో భావనారాయణ స్వామి గుడి వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వ్యక్తి ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 108కు సమాచారం అందించగా, వారు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 27, 2025
NGKL: మహాశివరాత్రి రోజు సింగోటంలో అద్భుతం.!

సింగోటంలోని శివకేశవ రూపమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శివరాత్రి వేళ అరుదైన దృశ్యం వెలుగు చూసింది. మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాలలో భాగంగా స్వామి వారికి అభిషేకం చేస్తుండగా సూర్య కిరణాలు స్వామివారి నిజస్వరూప దర్శనంపై పడటం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆలయ పూజారి సతీష్ శర్మ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగిందన్నారు.
News February 27, 2025
భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్ ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తన తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు.
News February 27, 2025
NGKL: మార్చి 2న వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి మార్చి 2న వనపర్తికి రానున్నారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో జరిగే ఉద్యోగ మేళాకు అతిథిగా సీఎం రానున్నారని మల్లు రవి తెలిపారు.