News April 13, 2025
బాపట్లలో చికెన్, మటన్ ధరలు ఇలా..!

బాపట్లలో ఆదివారం చికెన్, మటన్ ధరలకు డిమాండ్ పెరిగింది. నేడు కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.220, స్కిన్ రూ. 200ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900లుగా ఉంది. ఇవే ధరలు పలు మండలాలలో కొనసాగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News January 5, 2026
స్కూళ్లలో ఆధార్ క్యాంపులు.. ఉచితంగా అప్‌డేట్

AP: రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామ, వార్డు సచివాలయ విభాగం స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. 5-15 ఏళ్ల విద్యార్థులకు బయోమెట్రిక్స్ ఉచితంగా అప్‌డేట్ చేస్తారు. కొత్త కార్డులు కూడా ఇక్కడే తీసుకోవచ్చు. గత సెప్టెంబర్ నుంచి ప్రతీ నెలా స్పెషల్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఇంకా 16.51L మంది స్టూడెంట్స్ ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు.
News January 5, 2026
GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10:35 గంటలకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 10:45 గంటలకు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు సచివాలయానికి వస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీజీఎస్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
News January 5, 2026
అనంతగిరి ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ

అనంతగిరి ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెలకొంది. సుమారు నాలుగేళ్లు ఎంపీపీగా పనిచేసిన శెట్టి నీలవేణిపై సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవి కోల్పోయారు. ఈ క్రమంలో సోమవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని మండల ప్రత్యేక అధికారి స్వామినాయుడు తెలిపారు. మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను 9 మంది వైసీపీ, ఇద్దరు టీడీపీ, ఒకరు బీజేపీ, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు.


