News April 13, 2025
బాపట్లలో చికెన్, మటన్ ధరలు ఇలా..!

బాపట్లలో ఆదివారం చికెన్, మటన్ ధరలకు డిమాండ్ పెరిగింది. నేడు కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.220, స్కిన్ రూ. 200ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900లుగా ఉంది. ఇవే ధరలు పలు మండలాలలో కొనసాగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News April 11, 2026
ఆదోని ఎమ్మెల్యే చుట్టూ వివాదం.. పోస్టర్లు వైరల్

ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై అవినీతి ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లు హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ నేత సౌదీ రావుఫ్ రూ.10 లక్షల లంచం నిజమేనని, ఈ పోస్టర్ల ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాలని అందులో రాసి ఉంది. ఇదే సమయంలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
News April 11, 2026
SVU: ఈ నెల 13 లాస్ట్.!

SVU పరిధిలో ఈనెల 25వ తేదీ నుంచి పీజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజమాణిక్యం తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎమ్ఎస్ డేటాసైన్స్, ఎంఈడీ, ఎమ్ఎల్ఎస్సీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈనెల 13వ తేదీలోపు ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు.
News April 11, 2026
భారతీయుల ఇళ్లలో ₹462 లక్షల కోట్ల బంగారం!

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం నిల్వలు టాప్-10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వలను మించిపోయాయని అసోచామ్ వెల్లడించింది. మన ఇళ్లలో ఉన్న పసిడి విలువ సుమారు ₹462.25 లక్షల కోట్లని అంచనా. ఇందులో 2% నిధులు ఆర్థిక వ్యవస్థలోకి చేరినా దేశాభివృద్ధి వేగవంతమవుతుందని నివేదిక పేర్కొంది. 2025 నవంబర్ నాటికి గోల్డ్ లోన్ల విలువ ₹24.34 లక్షల కోట్లకు చేరింది. ఈ సంపదను ఉత్పాదక రంగంలోకి మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.


