News March 28, 2025

బాపట్లలో పర్యాటక రంగం విస్తరిస్తుంది: మంత్రి కందుల

image

బాపట్లలో పర్యాటక రంగం విస్తరిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. శుక్రవారం బాపట్ల పట్టణంలో సూర్యలంక రహదారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ హోటల్‌ను ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. బాపట్ల మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు.

Similar News

News November 12, 2025

ఉప్పల్: అంధ విద్యార్థుల పరీక్షలకు వాలంటీర్లు కావాలి

image

చిన్నజీయర్‌ ఆశ్రమంలో డిగ్రీ మొదటి సంవత్సరం అంధ విద్యార్థుల పరీక్షలకు స్రైబ్‌ల కోసం వాలంటీర్లు కావాలని కోరారు. సంస్కృతం చదవగలిగే, తెలుగులో నిర్దోషంగా రాయగల 20 మంది వాలంటీర్లు కావాలని తెలిపారు. ఈ నెల 14న ఉ.9-12 వరకు, మ.2- 5 వరకు జరిగే రెండు పరీక్షా సెషన్లకు స్రైబ్‌లుగా సేవలందించాలని వివరించారు. ఉప్పల్‌ నుంచి ఉచిత నుంచి బస్‌ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలకు 9032521741లో సంప్రదించాలన్నారు.

News November 12, 2025

సీఎం చంద్రబాబుతో ఫోర్జ్ వైస్ ఛైర్మన్ భేటీ

image

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కళ్యాణి చర్చించారు. విశాఖలో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్ ఉత్పత్తులపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. గండికోట, పాపికొండలు, అరకువ్యాలీలో టూరిజం ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి చూపారు. ఏపీలో ఉన్న వివిధ అవకాశాలను సీఎం ఆయనకు వివరించారు. గ్లోబల్ బ్రాండ్‌గా అరకు కాఫీ మారిందన్నారు.

News November 12, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి: MP

image

MHBD జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లు చేయాలని దిశా కమిటీ ఛైర్మన్, MP బలరాం నాయక్ అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంను కొనుగోలు కేంద్రాల సంఖ్య ప్రజావాసరాల దృష్ట్యా అట్టి సంఖ్యను పెంచి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.