News February 13, 2026

బాపట్ల: అధిక ఛార్జీ వసూలు చేస్తే 77028 06804కు కాల్ చేయండి

image

జిల్లాలో ప్రైవేట్ అంబులెన్స్ సేవల ధరలను నిర్ణయిస్తూ బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కిలోమీటర్ల వారీగా రేట్లు ఫిక్స్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే 77028 06804 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. 10కి.మీ లోపు పేషెంట్లకు రూ.900, మృతదేహాలకు రూ.1400లుగా ధర నిర్ణయించారు.

Similar News

News March 13, 2026

నేనూ రైతు బిడ్డనే: చంద్రబాబు

image

AP: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చే ₹6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ₹14 వేలు కలిపి ఏటా ప్రతి రైతు ఖాతాలో ₹20 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను కూడా రైతు బిడ్డనేనని.. వారి కష్టాలు తనకు తెలుసని, అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

News March 13, 2026

NRPT: ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ కలెక్టర్

image

నారాయణపేట ఆర్డీవోగా శుక్రవారం ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయిదు వారాల పాటు ఆర్డీవోగా విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్ ప్రాంతంలో మౌలికవసతుల పర్యవేక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు జరిగేలా చూస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవోకు తహశీల్దార్‌లు శుభాకాంక్షలు చెప్పారు.

News March 13, 2026

పలాస కేంద్రీయ విద్యాలయంపై X లో కేంద్ర మంత్రి పోస్ట్

image

పలాసలో కేంద్రీయ విద్యాలయం తరగతులు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు శుక్రవారం X లో పోస్ట్ పెట్టారు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యాలయం జిల్లాలోని సాయుధ దళాల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.