News July 14, 2024

బాపట్ల: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి

image

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో ఈనెల 5వ తేదీన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సోదరుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బాపట్ల జిల్లాకు చెందిన కంపిరి సురేశ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అతనికి ఇద్దరు కూమారులు. వారిలో పెద్దవాడు గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేందటే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించి తమ్ముడే హత్య చేశాడని SI తెలిపారు.

Similar News

News October 11, 2024

గుంటూరు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎస్పీ

image

గుంటూరు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, పోలీసు కుటుంబ సభ్యులకు ఎస్పీ సతీశ్ కుమార్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి నాడు.. అన్ని రంగాల్లో అందరికి విజయం చేకూరాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

News October 11, 2024

EVMలపై మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుందా?: మేరుగ

image

ఈవీఎంలపై మాట్లాడటానికి సీఎం చంద్రబాబుకు సిగ్గుందా? అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. గుంటూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఇంకోమాట మాట్లాడటం ఆయనకు అలవాటన్నారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చంద్రబాబే చేశారని.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.

News October 11, 2024

నందిగం సురేశ్‌కు అస్వస్థత

image

మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జైలు అధికారులు శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. లోబీపీ, భుజం నొప్పి, ఛాతీ నొప్పి ఉందని ఆయన జైలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అరెస్ట్ సమయంలోనే తనకు భుజం నొప్పి ఉందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సురేశ్‌ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు.