News February 13, 2025

బాపట్ల: అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

image

సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు ఎన్ఎస్పీ కాలువ వద్ద అప్పుల బాధతో విత్తనాల వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు పసుమర్తిపాలెంకు చెందిన సుబ్బారెడ్డిగా సంతమాగులూరు పోలీసులు గుర్తించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 24, 2025

అల్లూరి: 10th లెక్కల పరీక్షకు 104 మంది దూరం

image

అల్లూరి జిల్లాలో సోమవారం జరిగిన 10th లెక్కల పరీక్షకు మొత్తం 11665మంది హాజరు కావాల్సి ఉండగా 11561మంది హాజరయ్యారని, 104 మంది గైర్హాజరయ్యారని DEO. బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. అరకువాలీ, అనంతగిరి మండలాల్లో పలు పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి కాపీయింగ్ ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామని, జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్ష జరిగిందని తెలిపారు.

News March 24, 2025

భూ రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు ఎప్పుడంటే?

image

TG: ఎల్‌ఆర్ఎస్ గడువు పెంపు ఆలోచన ప్రస్తుతానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరని చెప్పారు. భూమికి మ్యాప్ లేని వాళ్లకు సర్వే చేయించి నిర్ధారిస్తామన్నారు. త్వరలోనే భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ విధానాన్ని అమలు చేస్తామన్నారు.

News March 24, 2025

వరంగల్: చింతకాయ దులపడానికి వెళ్లి మృతి

image

చింతచెట్టు నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. వర్ధన్నపేటలోని నీగిరిస్వామి తండాకి చెందిన నేతవత్ నిమ్మా కూలి పనులు చేస్తుంటాడు. ఇల్లందలో చింతకాయ దులపడానికి కూలికి వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ తెలిపారు. 

error: Content is protected !!