News March 5, 2025
బాపట్ల ఆర్డీవోను అభినందించిన కలెక్టర్

బాపట్ల డివిజన్ ఆర్డీవో గ్లోరియా రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 24మంది ప్యాట్రన్ సభ్యులను చేర్పించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ జె.వెంకట మురళి చేతుల మీదుగా రెడ్ క్రాస్ ఛైర్మన్ నారాయణ భట్టుకు రు.6,02,400 చెక్కును అందించారు. అనంతరం గ్లోరియాను కలెక్టర్ అభినందించి సత్కరించారు.
Similar News
News December 4, 2025
జగిత్యాల: మొదటి విడతలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను నిర్వహిస్తున్నారు. 7మండలాల్లో మొత్తం 122 పంచాయతీలు ఉండగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 4గ్రామాల సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన వాటిలో ఇబ్రహీంపట్నం మండలంలో మూలరాంపూర్, యామాపూర్, మెట్ పల్లి మండలంలో చింతల్ పేట, కథలాపూర్ మండలంలో రాజారాంతండా ఉన్నాయి.
News December 4, 2025
మోదీ ఒత్తిడికి లొంగే వ్యక్తి కాదు: పుతిన్

PM మోదీ ఒత్తిడికి లొంగే వ్యక్తి కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. భారత్‌పై సుంకాలతో US ఒత్తిడి తెస్తోందా అన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ‘భారత్ దృఢమైన వైఖరిని ప్రపంచం చూసింది. తమ నాయకత్వం పట్ల దేశం గర్వపడాలి’ అని India Today ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా-ఇండియా ద్వైపాక్షిక లావాదేవీల్లో 90% పైగా విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. తన ఫ్రెండ్ మోదీని కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
News December 4, 2025
‘స్పిరిట్’ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ ప్రీమియర్ కోసం జపాన్‌కు వెళ్లారు. డిసెంబర్ 5, 6న జరిగే ప్రీమియర్స్‌కు ఆయన హాజరవుతారు. డిసెంబర్ 12న ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ‘కల్కి 2898 AD’ ప్రమోషన్ల సమయంలో జపాన్ అభిమానులను కలవలేకపోయిన ప్రభాస్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈసారి వారిని కలవనున్నారు. దీని కారణంగా ఇటీవల ప్రారంభమైన ‘స్పిరిట్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.


