News February 9, 2025

బాపట్ల: ‘ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలి’

image

19 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని బాపట్ల జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల 10న జాతీయ నులిపురుగులు దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు అందించాలన్నారు. నులిపురుగుల వల్ల శరీరంలో రక్తహీనత, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు.

Similar News

News January 6, 2026

గ్యాస్ లీక్.. రూ.వందల కోట్ల నష్టం?

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D) ఇరుసుమండలోని ONGC డ్రిల్ సైట్ నుంచి <<18770706>>లీకవుతున్న<<>> గ్యాస్‌ను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాసేపట్లో ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ చేరుకోనున్నాయి.

News January 6, 2026

8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనాలు

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 8వ రోజుకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల బుధవారం, గురువారం రాత్రి వరకు సాగనున్నాయి. ఇప్పటివరకు లక్కి డిప్‌లో టోకెన్లు పొందిన స్థానికులు ఇవాళ నుంచి మూడు రోజులు దర్శనం చేసుకోనున్నారు. 7రోజు పాటు వైకుంఠ ద్వార దర్శనం 5,42,057 మంది భక్తులు చేసుకున్నారు.

News January 6, 2026

ఫాల్కన్ MD అమర్‌దీప్ అరెస్ట్

image

ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఆ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను గల్ఫ్ నుంచి ముంబైకి రాగా ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనిపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. MNC కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో చేసిన రూ.850 కోట్ల స్కామ్‌లో అమర్‌దీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.