News March 15, 2025

బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్

image

బాపట్ల పట్టణంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను బాపట్ల జిల్లా స్పెషల్ అధికారి కృతిక శుక్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పరిశీలించారు. శనివారం ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 8, 2026

NTR: ఫైన్లు మాత్రం వేస్తారు.. ఫిర్యాదు ఇస్తే పట్టించుకోరా?

image

తన బైక్ పోతే కనిపెట్టలేకపోయారు కానీ.. ఫైన్లు మాత్రం వేస్తున్నారంటూ ఓ యువకుడు ఆదివారం సీపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగాడు. నాలుగేళ్ల క్రితం బైక్ పోయిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పుడు కొత్త బైక్‌పై వెళ్తుంటే హెల్మెట్ లేదని జరిమానాలు వేస్తున్నారని ఫ్లెక్సీతో నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని టూటౌన్ స్టేషన్‌కు తరలించారు.

News February 8, 2026

వనపర్తి: ఫిబ్రవరి 11న యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్స్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 11న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని వనపర్తి డీఐఈవో (DIEO) అంజయ్య స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాక్టికల్స్ ఉన్న విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తమ కేటాయించిన కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు.

News February 8, 2026

చిత్తూరు: వృద్ధురాలి దారుణ హత్య

image

గుడిపల్లి (M) ON కొత్తూరు సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ఆదివారం చిన్నక్క (70) ఆనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతుతో పాటు చెవులను సైతం కోసి దారుణంగా హత్య చేశారు. ఇటుకల బట్టీలో వృద్ధురాలి మృతదేహం పడి ఉండడాన్ని ఇటుకల కోసం వచ్చిన వారు చూసి స్థానికులకు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.