News April 12, 2025
బాపట్ల: ఇంటర్ విద్యార్థులారా GET READY

ఇంటర్ ఫలితాలు ఇవాళ ఉదయం 11గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఆత్రుత కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఫస్టియర్ 10,838, సెకండియర్ 8,381, మొత్తం 19,219 మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
☛ ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News November 6, 2025
ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.
News November 6, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 6, 2025
అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గురువారం తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటిన అనంతరం ఆయన సిబ్బంది పరేడ్‌ను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్ బాక్స్‌లను స్వయంగా తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కిట్ ఆర్టికల్స్ నిర్వహణలో పరిశుభ్రత, శ్రద్ధ కనబరిచిన కానిస్టేబుల్ జితేందర్‌కు అభినందించి రివార్డును మంజూరు చేశారు.


