News February 12, 2025

బాపట్ల: ఈ పాప మీకు తెలుసా.!

image

బాపట్ల జిల్లా మహిళాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రావణి అనే పాప ఈనెల 5వ తేదీ నుంచి ఆశ్రయం పొందుతుందని, పాప తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ తగు ఆధారాలు చూపించి పాపను తీసుకువెళ్లాలని బాపట్ల జిల్లా శిశు సంక్షేమ అధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 30 రోజులలోపు పాపను తీసుకెళ్లని ఎడల ప్రభుత్వ అదేశాల ప్రకారం అనాథగా ప్రకటించి దత్తత ఇస్తామని తెలిపారు.

Similar News

News November 21, 2025

ADB: వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్డ మృతి

image

గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయి నిన్న పురిటి నొప్పులతో 108 సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రెండవ కాన్పు సిజేరియన్ చేయగా, డెలివరీ తర్వాత నిన్న రాత్రి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ మృతి చెందారని భర్త చిక్రం సుభాశ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

News November 21, 2025

వేములవాడ: ఒంటిపై గాయాలతో యువకుడి వీరంగం

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సాయి అనే యువకుడు ఒంటిపై గాయాలతో వీరంగం సృష్టించాడు. చొక్కా లేకుండా రక్తం కారుతున్నా అటు, ఇటు తిరుగుతూ హల్‌చల్ చేశాడు. సదరు యువకుడి చేష్టలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. భార్య కాపురానికి రావడం లేదనే సాయి ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది.

News November 21, 2025

కామారెడ్డి: నిఖత్ జరీన్‌కు కవిత అభినందనలు

image

మహిళల 51 కేజీల ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నిఖత్ జరీన్‌కు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అభినందనలు తెలిపారు. మీ అచంచలమైన అంకితభావం ప్రతి విజయంలోనూ ప్రతిఫలించింది. ఈ ఘన విజయం భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు అపారమైన గర్వకారణం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’ వేదికగా ఆమె ట్వీట్ చేశారు.