News February 12, 2025
బాపట్ల: ఈ పాప మీకు తెలుసా.!

బాపట్ల జిల్లా మహిళాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రావణి అనే పాప ఈనెల 5వ తేదీ నుంచి ఆశ్రయం పొందుతుందని, పాప తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ తగు ఆధారాలు చూపించి పాపను తీసుకువెళ్లాలని బాపట్ల జిల్లా శిశు సంక్షేమ అధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 30 రోజులలోపు పాపను తీసుకెళ్లని ఎడల ప్రభుత్వ అదేశాల ప్రకారం అనాథగా ప్రకటించి దత్తత ఇస్తామని తెలిపారు.
Similar News
News March 24, 2025
సీఎం పుట్టినరోజున ‘చంద్రన్న నాటకోత్సవాలు’

AP: వచ్చే నెల 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని వారం పాటు ‘చంద్రన్న నాటకోత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఏపీ నాటక అకాడమీ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20-26 వరకు జరిగే వేడుకల్లో నాటికలు, పౌరాణిక/సాంఘిక నాటకాలు, పద్య నాటకాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది. ఆసక్తిగలవారు వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించే నాటక వివరాలను వెల్లడిస్తూ నాటక <
News March 24, 2025
రేపు 52 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో రేపు 52, ఎల్లుండి 88 మండలాల్లో <
News March 24, 2025
NZB: ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది గైర్హాజరు: డీఈవో

2025 పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 22,735 మంది విద్యార్థులకు 22,679 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో అధికారికంగా వెల్లడించారు.