News April 3, 2025

బాపట్ల: ఊరికి వెళ్తే సమాచారం ఇవ్వండి- ఎస్పీ

image

తాత్కాలికంగా ఇంటికి తాళాలు వేసి విహార యాత్రలు, తీర్ధయాత్రలకు వెళ్లేవారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో సమాచారం ఇచ్చి వెళ్లాలని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి గురువారం ప్రజలకు సూచించారు. వేసవి సెలవులను ఆసరాగా చేసుకొని తాళం వేసిన ఇళ్లలో జరిగే దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. సమాచారం ఇవ్వడం వల్ల ఆ ఇంటిపై నిరంతర పోలీస్ నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News April 20, 2025

సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 20, 2025

VIRAL: ఈ 500 తీసుకుని పాస్ చేయండి..!

image

కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు రూ.500 నోట్లు పెట్టారు. పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు. ఇంకొందరైతే ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని రాశారు. మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు.

News April 20, 2025

తిరుపతి: 22వ తేదీన జాబ్ మేళా

image

ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరియర్ సెంటర్ (MCC)AY 22వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. దాదాపు 14 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!