News March 18, 2025
బాపట్ల: ‘ఎండల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి’

ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయమ్మ తెలిపారు. మంగళవారం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. ప్రజలు బయటకు వెళ్లే సమయంలో గొడుగు వినియోగించాలన్నారు. మంచి నీరు, మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలన్నారు.
Similar News
News February 25, 2026
మెదక్: తొలిరోజు 99.42 శాతం

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.
News February 25, 2026
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయాలి: కలెక్టర్

మార్టూరు మండల స్థాయి అధికారులకు బుధవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో శాఖల మధ్య సమన్వయం ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించాలని సూచించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు.
News February 25, 2026
2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులు: CBN

AP: 2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి రోజులు ఉన్నాయని, ఐదేళ్లు ఎలాంటి పనులు జరగలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయిందని గత సీఎం దొంగ మాటలు చెప్పారని మండిపడ్డారు. పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కట్ చేశారని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, పూర్తి చేసే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. ఒట్టి మాటలు చెప్పి మోసం చేయడం తనకు రాదని మార్కాపురం సభలో అన్నారు.


