News March 29, 2024

బాపట్ల ఎంపీగా గెలిచేదెవరు?

image

2019 బాపట్ల పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ గెలుపుపై మళ్లీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్‌పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ సీటును కైవసం చేసుకొనేందుకు రిటైర్డ్ డీజీపీ టి.కృష్ణప్రసాద్‌ను రంగంలోకి దింపింది. వైసీపీ తరఫున మళ్ళీ ఎంపీ నందిగం సురేశ్‌కే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. 

Similar News

News January 19, 2025

డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద పోలీసుల విచారణ

image

మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం అలాగే జాతీయ పార్టీ కార్యాలయం వద్ద శనివారం డ్రోన్ కలకలం రేపిన సంగతి విధితమే. ఈ మేరకు జిల్లా పోలీస్ అధికారులు క్యాంపు కార్యాలయం వద్ద విచారణ చేపట్టారు. డ్రోన్ ఎవరు ఎగరవేశారు, ఎటువైపు నుంచి డ్రోన్ వచ్చింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. పవన్ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

News January 19, 2025

గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత

image

కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో 312 మంది ఉత్తీర్ణత సాధించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న పరీక్షల్లో శనివారం 529 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పలు దశల్లో కొందరు అనర్హులుగా మిగిలారు. దీంతో మొత్తం 434 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో చివరికి 312 మంది అర్హత పొందారు. అదనపు ఎస్పీలు జీవీ రమణ మూర్తి, ఎ. హనుమంతు పరీక్షలను పరిశీలించారు.

News January 18, 2025

మంగళగిరి: పవన్‌ క్యాంప్‌ ఆఫీసుపై డ్రోన్‌ కలకలం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు అయిన మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కార్యాలయంపై ఓ డ్రోన్‌ చక్కర్లు కొట్టింది. దాదాపు 20నిమిషాలు పాటు డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. దీంతో ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే డీజీపీ, కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.