News March 30, 2025

బాపట్ల: ఎస్పీ పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

image

సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోమవారం రంజాన్ పండగ పురస్కరించుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు ప్రకటించారు. కావున ప్రజలు అర్జీలు అందించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని సూచించారు.

Similar News

News November 18, 2025

మంత్రి సత్యకుమార్ పేరుతో ఫేక్ TTD లెటర్లు!

image

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ TTD లెటర్లు జారీకావడం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. కొన్నిరోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఆయన సిబ్బంది పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామన్నారు.

ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

image

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.