News March 30, 2025
బాపట్ల కలెక్టరేట్లో ఘనంగా ఉగాది వేడుకలు

బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఉగాది వేడుకలను బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 2, 2025
మెదక్‌లో మూడు చారిత్రక శాసనాలు

మెదక్ పట్టణ నడిబొడ్డున మూడు చారిత్రక విలువైన శాసనాలు అందుబాటులో ఉన్నాయని ఔత్సాహిక చారిత్రక పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. గిద్దెకట్ట చెరువు ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న ఒక శాసనం మట్టిలో కలిసి పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానిని భూమిలోంచి తీసి పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మరొక శాసనం నవాబ్‌పేటలో ఖిల్లా వెనుక నల్లరాతిపై చెక్కించినట్లు సంతోష్ పేర్కొన్నారు.
News November 2, 2025
అడుగు దూరంలో ట్రోఫీ.. నేడే ఫైనల్

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఆఖరి మజిలీకి చేరుకుంది. దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడటానికి కొన్ని గంటలే మిగిలున్నాయి. నవీ ముంబయి వేదికగా WC ఫైనల్లో హర్మన్ ప్రీత్ సేన SAతో తలపడనుంది. ఎవరు గెలిచినా వారికి ఇదే తొలి WC అవుతుంది. రెండుసార్లు ట్రోఫీకి అడుగుదూరంలో ఆగిపోయిన భారత మహిళల జట్టు ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.
News November 2, 2025
మహేశ్‌ని అలా ఎప్పుడూ అడగలేదు: సుధీర్ బాబు

తన సినిమాల్లో హిట్లున్నా, ఫ్లాపులున్నా పూర్తి బాధ్యత తనదేనని హీరో సుధీర్ బాబు ‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘కృష్ణకు అల్లుడు, మహేశ్‌కు బావలా ఉండటం గర్వకారణం, ఓ బాధ్యత. కృష్ణానగర్‌లో కష్టాలు నాకు తెలియదు. కానీ, ఫిల్మ్‌నగర్ కష్టాలు నాకు తెలుసు. నాకో పాత్రగానీ, సినిమాగానీ రికమెండ్ చేయమని నేను మహేశ్‌ను ఎప్పుడూ అడగలేదు’ అని తెలిపారు. జటాధర మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


