News January 26, 2025
బాపట్ల కలెక్టరేట్‌లో తేనేటి విందు

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ఆదివారం రాత్రి తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళి, మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలపై చర్చించుకున్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.
Similar News
News December 6, 2025
కృష్ణా: నకిలీ సిమ్‌లు.. మరో 8 మందికి సంకెళ్లు

వినియోగదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలతో అక్రమంగా సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు ముమ్మరం చేసి, తాజాగా మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉండగా, ఈ మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News December 6, 2025
VZM: రెస్ట్ కోసం కారు ఆపితే..!

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు <<18484112>>స్వాములు<<>> అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి ప్రయాణం ప్రమాదమని భావించి రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన వాహనం ఆపారు. అందరూ నిద్రలో ఉండగా మృత్యు లారీ కారు మీదకు దూసుకు రావడంతో నలుగురు చనిపోయారు. వీరి మరణ వార్త విన్న కుటుంబీకులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు.
News December 6, 2025
నాగర్ కర్నూల్: అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల వారం రోజులపాటు చలి తీవ్రత తగ్గినప్పటికీ రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలి పెరిగింది. శనివారం వెల్దండలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తోటపల్లి 14, కల్వకుర్తి 14.4, బిజినపల్లిలో 14.7 డిగ్రీలు నమోదయ్యాయి.


