News March 12, 2025
బాపట్ల కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చిన వైసీపీ నేతలు

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి నాగర్జున కోరారు. ఈ మేరకు వైసీపీ నాయకులతో కలిసి బుధవారం బాపట్ల కలెక్టర్ వెంకట మురళికి వినతిపత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు.
Similar News
News February 15, 2026
బాపట్లలో పండగ పూట విషాదం

బాపట్లలో పండగపూడ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు కారుమూరి సతీష్ (35) విద్యుత్ షాక్‌తో మరణించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సతీష్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడన్నారు. యువ నాయకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News February 15, 2026
మహబూబాబాద్‌లో 144 సెక్షన్: ఎస్పీ

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ (163 BNSS) అమల్లో ఉంటుందని ఎస్పీ డా. శబరిష్ తెలిపారు. నలుగురికి మించి గుంపులుగా తిరగడం, విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు కాల్చడంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
News February 15, 2026
వాలీబాల్ లీగ్ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు ప్రథమ స్థానం

భట్టిప్రోలులో నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల వాలీబాల్ లీగ్ పోటీలు ఆదివారంతో ముగిసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కరీంశెట్టి సుబ్బారావు తెలిపారు. ఆదివారం భట్టిప్రోలు ప్రభుత్వ పాఠశాలలో సుబ్బారావు మాట్లాడారు. ఈ పోటీల్లో 8 టీములు పాల్గొన్నాయన్నారు. కృష్ణాజిల్లా 1వ స్థానం సాధించిందన్నారు. బాపట్ల జిల్లా-2, ప్రకాశం జిల్లా -3, ఎన్టీఆర్ జిల్లా -4వ స్థానంలో నిలిచాయన్నారు.


