News February 26, 2026
బాపట్ల కలెక్టర్‌కు వైసీపీ నేతల వినతి

మాజీ CM వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ బుధవారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్‌కు YSRCP నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన. రఘుపతి పిలుపుమేరకు స్థానిక మార్కెట్ యార్డు సమీపంలోని నేషనల్ హైవే వద్ద, త్రువ్వ కాలవ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 14, 2026
పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించడమేంటి: జగన్

AP: SM కేసులలో పోలీసులు వీధి రౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని YCP చీఫ్ జగన్ మండిపడ్డారు. ‘TDP నేతల మెప్పుకోసం కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. వారిపై హైకోర్టులో కేసులు వేసి బాధితులకు న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. వేమూరు, రేపల్లె YCP నేతలు ఇవాళ జగన్‌ను కలిశారు. GOVT, TDP తీరుపై SMలో విమర్శించినందుకు పోలీసులు కొట్టారని పార్టీ నేతలు తనీష్, కృష్ణార్జునరెడ్డి తెలిపారు.
News April 14, 2026
కడప జిల్లాలో బెల్ట్ షాపులపై 47 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసులు నమోదు చేశారు. 47 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.
News April 14, 2026
ADB: రేపు జిల్లాకు మంత్రి పొన్నం రాక

రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ నెల 15న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్‌లో నిర్వహించే పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు ఆర్టీవో అధికారులు మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు.


