News February 26, 2026

బాపట్ల కలెక్టర్‌కు వైసీపీ నేతల వినతి

image

​మాజీ CM వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ బుధవారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్‌కు YSRCP నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన. రఘుపతి పిలుపుమేరకు స్థానిక మార్కెట్ యార్డు సమీపంలోని నేషనల్ హైవే వద్ద, త్రువ్వ కాలవ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 18, 2026

కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

image

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

image

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.