News February 26, 2026
బాపట్ల కలెక్టర్‌కు వైసీపీ నేతల వినతి

మాజీ CM వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరుతూ బుధవారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్‌కు YSRCP నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన. రఘుపతి పిలుపుమేరకు స్థానిక మార్కెట్ యార్డు సమీపంలోని నేషనల్ హైవే వద్ద, త్రువ్వ కాలవ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 19, 2026
గ్రేటర్ జోన్‌లో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

గ్రేటర్ జోన్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. గత రెండు రోజులుగా అత్యధికంగా 99 నుంచి 100 మిలియన్ యూనిట్లు నమోదవుతోంది. సాధారణంగా వేసవి తీవ్రత పెరిగే మే నెలలో విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు ముందుగానే పెరగడం, వాణిజ్య, గృహ వినియోగం అధికం కావడం వల్ల మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయి డిమాండ్ నమోదైంది.

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.