News November 29, 2024
బాపట్ల కోర్టుకు వర్రా రవీంద్ర తరలింపు

అసభ్యకర పోస్టుల కేసులో కడప జైలుకు వెళ్లిన వర్రా రవీంద్రరెడ్డిపై ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో మరో కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా రవీంద్రను PT వారెంట్‌పై కడప జైలు నుంచి బాపట్ల పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. ఇవాళ ఆయనను బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచనున్నట్లు సమాచారం.
Similar News
News November 2, 2025
మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన మాజీ సైనికులు

కడప R&B గెస్ట్ హౌస్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఆదివారం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మాజీ సైనికులు మర్యాదపూర్వకంగా కలిశారు. అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా సంతోషంగా ఉండాలని వెంకయ్య చెప్పారన్నారు. తమ పట్ల మాజీ ఉప రాష్ట్రపతి చూపిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపామని వారు అన్నారు.
News November 2, 2025
విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్ కు కాల్ చేయండి.!

ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని మొట్టమొదటగా నిర్వహించనున్నట్లు సంస్థ ఛైర్మన్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లా వాసులు ఉదయం 10-12 గంటల మధ్య 89777 16661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చన్నారు.
News November 2, 2025
ప్రొద్దుటూరు: అక్టోబర్‌లో రూ.65.07 కోట్ల మద్యం విక్రయం

గత నెలలో ప్రొద్దుటూరు IMFL డిపోలో రూ.65.07 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. బద్వేల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రూ.10.28 కోట్లు, జమ్మలమడుగు రూ.7.30 కోట్లు, ముద్దనూరు రూ.3.58 కోట్లు, మైదుకూరు రూ.8.77 కోట్లు, ప్రొద్దుటూరు రూ.16.65 కోట్లు, పులివెందుల రూ.11.22 కోట్లు, ఎర్రగుంట్లలో రూ.7.23 కోట్ల మద్యం విక్రయించారు. 91,291 కేసుల IML మద్యం, 39,902 కేసుల బీరు విక్రయించినట్లు చెప్పారు.