News November 29, 2024
బాపట్ల కోర్టుకు వర్రా రవీంద్ర తరలింపు
అసభ్యకర పోస్టుల కేసులో కడప జైలుకు వెళ్లిన వర్రా రవీంద్రరెడ్డిపై ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో మరో కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా రవీంద్రను PT వారెంట్‌పై కడప జైలు నుంచి బాపట్ల పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. ఇవాళ ఆయనను బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచనున్నట్లు సమాచారం.
Similar News
News December 8, 2024
వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డికి 41ఏ నోటీసు
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీంద్రారెడ్డి కేసుకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి మరోసారి పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులలో సోమవారం ఉదయం 10 గంటలకు కడప సైబర్ సెల్ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు. గతంలో కూడా పులివెందుల పోలీసులు రాఘవరెడ్డికి నోటీసులు అందించారు. అయితే రాఘవరెడ్డి విచారణకు హాజరు కాలేదు.
News December 8, 2024
మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో ఒరిగిందేమీ లేదు: రాచమల్లు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. అమ్మబడి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, నాడు-నేడు పనులను నిలిపేశారన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తగ్గిపోతోందని పేర్కొన్నారు.
News December 8, 2024
రాయచోటి ప్రశాంతంగా ఉండేందుకు సహకరించాలి: మంత్రి
రాయచోటి పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముస్లిం, హిందూ సోదరులు సోదర భావంతో ముందుకు వెళ్లాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రాయచోటిలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పట్టణంలో ఎవరైనా ప్రజలను రెచ్చగొట్టిన అల్లర్లకు పాల్పడినా, ప్రేరేపించినా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.