News February 27, 2026
బాపట్ల: గురుకులంలో ప్రవేశాలకు మార్చి 1న ఎంట్రెన్స్ టెస్ట్

బాపట్ల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 1న జరిగే ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరు కావాలని ప్రిన్సిపల్ పద్మావతి పేర్కొన్నారు. మార్చి 1న ఐదవ తరగతి వారికి ఉదయం 9:30 నుంచి 11గంటల వరకు, ఇంటర్ వారికి మధ్యాహ్నం 12 నుంచి 1:30గంటల వరకు, ఐఐటీ నీట్ పరీక్ష మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30గంటల వరకు జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 16, 2026
ASF: ప్రశ్నార్థకంగా కొమురం భీమ్ ప్రాజెక్టు..!

ASF(D)లోని 69 గ్రామాల్లో 45,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించే 10.393TMCల సామర్థ్యం గల కొమురం భీమ్ ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1,012 మీటర్ల పొడవున్న మట్టి ఆనకట్ట గట్టులో పగుళ్లు ఏర్పడడంతో 4ఏళ్లుగా కొట్టుమిట్టాడుతోంది. అయితే అధికారులు గట్టుపై పాలథీన్ కవర్లు కప్పడం గమనార్హం. CWC పరిశీలించినా శాశ్వత గ్రాటింగ్ పనులు నిధుల కొరత వల్ల పనులు నిలిచిపోయాయి. రూ.18కోట్లు మంజూరు చేసినా విడుదల కాలేదు.
News April 16, 2026
టీయూ పాలక మండలిలో కామారెడ్డి జిల్లాకు చోటు

రాష్ట్ర ప్రభుత్వం గురువారం టీయూ పాలకమండలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఘాజీని పాలకమండలి సభ్యునిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ షబ్బీర్ అలీ వద్ద పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సామాజిక సేవా రంగం(జర్నలిజం) విభాగంలో ఆయన్ను సభ్యునిగా నియమించారు. ఆయన నియామకం పట్ల షబ్బీర్ అలీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.
News April 16, 2026
ఢిల్లీలో ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ప్రజా ప్రతినిధుల సందడి

ఢిల్లీలో ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు గురువారం సందడి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ చర్చల నేపథ్యంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు దిగారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత, మంత్రి సంధ్యారాణి, MLAలు జగదీశ్వరి, నాగమాధవి, ఎమ్మెల్సీ గ్రీష్మ, తదితరులు పాల్గొన్నారు.


