News March 9, 2025
బాపట్ల : చికెన్, మటన్ ధరలు ఇలా..!

బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్, మటన్ధరలకు డిమాండ్ పెరిగింది. గతవారంతో పోలిస్తే కేజీకి రూ.20-30 ధర పెరిగింది. పలు చోట్ల ఈ వారం కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.200, స్కిన్ రూ. 180ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.800- 900లు ఉంది. బర్డ్ ఫ్లూ భయాందోళనలు తగ్గడంతో చికెన్ ధరలలో రూ.30లకు పైగా ధర పెరిగింది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 3, 2025
రైల్వే ట్రాక్ పై నాటు బాంబు ఘటనపై ఎస్పీ క్లారిటీ

కొత్తగూడెం రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలోని నాటు బాంబును కొరికి ఒక కుక్క మృతి చెందినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని చెత్త పడేసే ప్రదేశం నుంచి కుక్క తినే పదార్థం అని భావించి అడవి జంతువులను వేటాడటానికి తయారుచేసిన నాటు బాంబును ట్రాక్ మీదకు తీసుకువచ్చి కొరకడంతో పేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. ఎవరూ కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.
News December 3, 2025
సమ్మిట్కు రావాలని కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానం

ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025కు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరినట్లు పెద్దపల్లి MP వంశీకృష్ణ తెలిపారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, MPలతో కలిసి ఢిల్లీ వెళ్లిన వంశీకృష్ణ బుధవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి ప్రాధాన్యతపై చర్చించారు.
News December 3, 2025
ఉప్పల్ నుంచి యాదాద్రి.. వేగంగా విస్తరణ

ఉప్పల్ నుంచి యాదాద్రి వెళ్లే వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఓ వైపు అండర్ ఫ్లో వర్క్, లేన్ల విస్తరణ సైతం కొనసాగుతోంది. ప్రత్యేక ఇంజినీరింగ్ యంత్రాలతో గత నాలుగు రోజులుగా పనుల్లో మరింత వేగం పెంచినట్లుగా AEE సాయికుమార్ తెలిపారు. NHAI అధికారుల బృందం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మెటీరియల్ టెస్టింగ్ నిర్వహిస్తుంది.


