News February 10, 2025

బాపట్ల: చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నం

image

బాపట్ల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్లూరులో గత నెల 29న తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఇంటిపక్కనుండే ఉదరగడి లక్ష్మయ్య(50) బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి, దుస్తులు తీస్తుండగా పారిపోయింది. ఎవరికీ చెప్పకుండా భయపడుతుండటంతో బాలికను ప్రశ్నించడంతో ఈనెల 5న తెలిసింది. విషయాన్ని గ్రామ పెద్దలకు తెలపడంతో వారి సాయంతో పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News December 1, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

image

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్‌లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.

News December 1, 2025

ఆత్మకూరులో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

image

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సోమవారం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన రూ.15 కోట్ల చొప్పున ఆత్మకూరు, అమరచింత నగర అభివృద్ధి పనులకు, రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి భవనానికి, రూ.121.92 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

News December 1, 2025

మహబూబాబాద్ డీఈఓగా రాజేశ్వర్ బాధ్యతల స్వీకరణ

image

జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈఓగా పనిచేసిన దక్షిణామూర్తి వీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో, విద్యాశాఖ ఏడీగా ఉన్న రాజేశ్వర్‌ను డీఈఓగా నియమించారు. జిల్లా విద్యాశాఖ సిబ్బంది, పలువురు నూతనంగా బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్‌రావుకు అభినందనలు తెలిపారు.