News March 12, 2025

బాపట్ల జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ IAS అధికారులు కృతిక శుక్లాను బాపట్ల జిల్లాకు, కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణను పల్నాడుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాల్ని సరిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News September 14, 2025

అభివృద్ధి వైపు కొడంగల్ అడుగులు

image

కొడంగల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టడంతో నియోజకవర్గ అభివృద్ధికి రూ.10వేల కోట్లు మంజూరయ్యాయి. రూ.6.80 కోట్లతో R&B అతిథిగృహం పనులు కొనసాగుతుండగా 220 పడకల ఆసుపత్రి పనులు తుదిదశలో ఉన్నాయి. నూతన మున్సిపల్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రోడ్ల విస్తరణకు రూ.344 కోట్లు మంజూరు కావడంతో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.

News September 14, 2025

ఖమ్మంలో లోక్ అదాలత్.. 597 కేసులు పరిష్కారం

image

ఖమ్మం జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ప్రారంభించారు. లోక్ అదాలత్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఆయన చెప్పారు. ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 4,746 కేసులను గుర్తించగా, వాటిలో 597 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. భార్యాభర్తల గొడవలు, ఆస్తి వివాదాలు, బ్యాంక్ రికవరీ, రోడ్డు ప్రమాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు

News September 14, 2025

మీరు ఇలాంటి సబ్బును ఉపయోగిస్తున్నారా?

image

కొందరు ఏది దొరికితే అదే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల శరీరానికి హానీ కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రత్యేకంగా సబ్బు వాడాలనుకునేవారు వైద్యుడి సలహా తీసుకోవాలి. కొబ్బరి నూనె, షియా బటర్, కలబంద, తేనె వంటి సహజ పదార్థాలతో చేసిన సోప్ వాడాలి. ఇవి చర్మం, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. రసాయనాలు కలిపిన సబ్బులతో స్నానం చేస్తే చికాకు, ఆందోళన, అనారోగ్యం పాలవుతారు’ అని వారు చెబుతున్నారు.