News April 12, 2025

బాపట్ల జిల్లాకు 17వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో బాపట్ల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 7,420 మంది పరీక్షలు రాయగా 5,837 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే 17వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 9,146 మందికి 5,907 మంది పాసయ్యారు. 65 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 14వ స్థానంలో బాపట్ల జిల్లా నిలిచింది.

Similar News

News November 13, 2025

మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

image

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News November 13, 2025

VZM: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఎక్కడంటే..!

image

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో పారదర్శక తూకం, న్యాయమైన ధర, తక్షణ చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News November 13, 2025

హనుమకొండ: స్కాలర్ షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని జిల్లా పరిషత్, ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహస్వామి తెలిపారు. అర్హులైన ఈబీసీ, బీసీ విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో డిసెంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.