News March 11, 2025
బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షకు 471 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 471 మంది విద్యార్థులు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 10,679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కాగా 10,202 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 13, 2025
ప్రతిష్టాత్మక కమిటీలో మచిలీపట్నం ఎంపీకి స్థానం

మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మరో ప్రతిష్టాత్మక కమిటీలో చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు సంయుక్త కమిటీ సభ్యులుగా బాలశౌరిని నియమించారు. ప్రతిష్టాత్మకమైన కమిటీలో చోటు దక్కినందుకు ఎంపీ బాలశౌరి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
News November 13, 2025
LSG-MI మధ్య టాక్స్.. ఎక్స్ఛేంజ్ అయ్యేది వీళ్లే!

IPL రిటెన్షన్ గడువు దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల స్వాపింగ్ చర్చల్లో వేగం పెంచాయి. RR, CSK మధ్య <<18253766>>కీలక ఆటగాళ్ల<<>> ఎక్స్ఛేంజ్కు ఇప్పటికే ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. తాజాగా LSG-MI కూడా చెరో ప్లేయర్ను మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. LSG నుంచి MIకి శార్దూల్ ఠాకూర్, MI నుంచి LSGకి అర్జున్ టెండూల్కర్ మారతారని cricbuzz తెలిపింది. MIతో శార్దూల్ డీల్ కుదిరినట్లు అశ్విన్ చెప్పడం గమనార్హం.
News November 13, 2025
‘పామాయిల్ తోటల పెంపకంపై అవగాహన కల్పించాలి’

జిల్లాలో పామాయిల్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఉద్యాన శాఖ ప్రతి నెల 100 హెక్టార్లలో పామాయిల్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ మొబైల్ వాహనాల ద్వారా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు.


