News March 7, 2025
బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 270 మంది గైర్హాజరు

బాపట్ల జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షకు 270 మంది విద్యార్థులు హాజరు కాలేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 8,390 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 8120 మంది పరీక్షలకు వచ్చారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Similar News
News March 17, 2025
అల్లూరి: పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. అడ్డతీగల, అనంతగిరి, శివలింగంపురం, కొత్త బల్లుగూడ, చింతపల్లి, మోతుగూడెం, దేవీపట్నం, డుంబ్రిగూడ, జి. మాడుగుల, గూడెం, సీలేరు, బాకూరు, కూనవరం, నరసింగపేట, బోదులూరు, జోలాపుట్, సింగంపల్లి, గౌరీదేవిపేట, ఎస్‌విగూడెం, వై రామవరంలో కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News March 17, 2025
కర్నూలు: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో ఆదివారం గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివారులోని మెలిగుట్ట దగ్గర ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శరీరం గుర్తుపట్టని విధంగా ఉంది. మృతుని ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ 9121101152కి సంప్రదించాలని సూచించారు.
News March 17, 2025
TODAY HEADLINES

* రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం
* అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం: సీఎం
* హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
* KCR జాతిపిత.. రేవంత్ బూతుపిత: హరీశ్‌రావు
* తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా?: రేవంత్
* ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతీ నొప్పి, ఆస్పత్రిలో చేరిక
* యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు
* నా బాల్యమంతా తీవ్ర పేదరికంలోనే: PM మోదీ
* IML విజేతగా టీమ్ ఇండియా