News March 8, 2025
బాపట్ల జిల్లాలో క్రీ.శ. 1871 నాటి వివిధ పట్టణాల జనాభా.!

బాపట్ల జిల్లాలో 1871వ సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మొత్తం జిల్లా జనాభా 15,48,480 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 7,80,588 మంది కాగా మహిళలు 7,67,892 మందిగా నమోదయ్యారు. అప్పటి పట్టణాల వారిగా బాపట్ల-6,086 మంది, చీరాల-9,061మంది, గుంటూరు-19,646 మంది, నిజాంపట్నం-4,128 మంది ఉన్నారు. 1881 సంవత్సరంలో జనాభా గణన ప్రకారం 1871 కన్నా పురుషుల పెరుగుదల శాతం 5.84 కాగా, స్త్రీల పెరుగుదల శాతం 7.42గా ఉంది.
Similar News
News November 9, 2025
రాజన్నకు దండాలు.. భీమన్నకు మొక్కులు..!

వేములవాడలో భక్తులు కొత్త రకమైన వాతావరణం ఎదుర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో కోడె మొక్కులు సహా అన్ని రకాల ఆర్జిత సేవలను భీమన్న ఆలయంలోకి మార్చిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం మొక్కుల చెల్లింపు కోసం శ్రీ భీమేశ్వరాలయం సందర్శించి అభిషేకం, అన్నపూజ, కోడెమొక్కు చెల్లిస్తున్నారు.
News November 9, 2025
విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి విశాఖలోని మల్కాపురంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడే ఓ బార్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యం బారిన పడిన గణపతి శనివారం అర్ధరాత్రి బార్ వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News November 9, 2025
15L టన్నుల చక్కెర ఎగుమతికి గ్రీన్సిగ్నల్?

2025-26లో 15L టన్నుల చక్కెర ఎగుమతులను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొలాసిస్(చక్కెర తయారీలో ఏర్పడే ద్రవం)పై 50% ఎగుమతి సుంకాన్ని ఎత్తేస్తుందని సమాచారం. దీనివల్ల మిల్లులకు లాభాలు, రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతాయని భావిస్తోంది. వచ్చే సీజన్లో చక్కెర ఉత్పత్తి 18.5% పెరిగి 30.95M టన్నులకు చేరుతుందని అంచనా. ఇథనాల్ ఉత్పత్తికి 34L టన్నులు వినియోగించినా భారీగా మిగులు ఉండనుంది.


