News March 8, 2025
బాపట్ల జిల్లాలో క్రీ.శ. 1871 నాటి వివిధ పట్టణాల జనాభా.!

బాపట్ల జిల్లాలో 1871వ సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మొత్తం జిల్లా జనాభా 15,48,480 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 7,80,588 మంది కాగా మహిళలు 7,67,892 మందిగా నమోదయ్యారు. అప్పటి పట్టణాల వారిగా బాపట్ల-6,086 మంది, చీరాల-9,061మంది, గుంటూరు-19,646 మంది, నిజాంపట్నం-4,128 మంది ఉన్నారు. 1881 సంవత్సరంలో జనాభా గణన ప్రకారం 1871 కన్నా పురుషుల పెరుగుదల శాతం 5.84 కాగా, స్త్రీల పెరుగుదల శాతం 7.42గా ఉంది.
Similar News
News March 19, 2025
ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి పనుల అమలు: కలెక్టర్

ఖమ్మం: రాబోయే 10 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి హామీ పనులను జిల్లాలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సంప్రదించి ఆసక్తి గల వారి పొలాల్లో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.
News March 19, 2025
రోదసిలో అధిక కాలం ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలివే

గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల శారీరక శ్రమ ఉండదు. తద్వారా కండరాలు, ఎముకలలో క్షీణత మెుదలవుతుంది. భార రహిత స్థితి వల్ల చెవిలోని వెస్టిబ్యులర్ అవయవానికి అందే సమాచారం మారిపోతుంది దీంతో మెదడు సరిగ్గా పనిచేయదు. శరీరంలోని పైభాగంలో, తలలో రక్తం పేరుకుపోతోంది. తెల్ల రక్తకణాలు తగ్గే ప్రమాదముండటంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అధిక రేడియో ధార్మికత వల్ల దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవ్వచ్చు.
News March 19, 2025
బాలానగర్: అంగన్వాడీ టీచర్ అదృశ్యం

ఓ అంగన్వాడీ టీచర్ అదృశ్యమైన ఘటన బాలానగర్ మండలంలోని వనమోనిగూడ గ్రామంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. లత గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. ఈనెల 16న ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదని అత్త యాదమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.