News March 1, 2025
బాపట్ల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

బాపట్ల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 10,838 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నేపథ్యంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే 08643 220182 కంట్రోల్ రూము నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST
Similar News
News March 1, 2025
ఢిల్లీలో ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్

కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ వాహనాలను గుర్తించేందుకు పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి పబ్లిక్ CNG బస్సుల్లో 90% బస్సులు తొలగిస్తామని, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది.
News March 1, 2025
మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్

TG: మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ కులం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, BJP, BRSకు చెందిన కాపు నేతలు పాల్గొన్నారు. కులగణనలో కాపుల సంఖ్యను తగ్గించారని, ప్రభుత్వ/నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సభ, మంత్రి పదవి ఇస్తేనే కులగణనపై కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News March 1, 2025
ఫిబ్రవరి GST కలెక్షన్స్ @ రూ.1.84లక్షల కోట్లు

ఫిబ్రవరిలో స్థూల GST వసూళ్లు 9.1% పెరిగి రూ.1.84లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థానిక రాబడి 10.2% ఎగిసి రూ.1.42లక్షల కోట్లు, దిగుమతులపై రాబడి 5.4% ఎగిసి రూ.41,702కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో CGST రూ.35,204 కోట్లు, SGST రూ.43,704 కోట్లు, IGST రూ.90,870 కోట్లు, సెస్ రూ.13,868 కోట్లు. ఇక రూ.20,889 కోట్లు రీఫండ్ చెల్లించగా నికర GST రూ.1.63లక్షల కోట్లుగా తేలింది. 2024 FEBలో ఇది రూ.1.50 లక్షల కోట్లే.