News March 1, 2025
బాపట్ల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

బాపట్ల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 10,838 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నేపథ్యంలో ఏవైనా సమస్యలు ఏర్పడితే 08643 220182 కంట్రోల్ రూము నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST
Similar News
News March 26, 2025
టేకులపల్లిలో వడదెబ్బకు రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మద్రాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడుకి చెందిన కేలోతు గోబ్రియా అనే రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన సోమవారం తన పొలంలో పండించిన కూరగాయలు, నువ్వులు కోయడానికి వెళ్లి ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందాడు.
News March 26, 2025
KNR: జపాన్-ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి యువ ఆవిష్కర్త ఎంపిక

కరీంనగర్‌కు చెందిన యువ ఆవిష్కర్త శుభ శ్రీ సాహు ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నప్పుడు రైతులకోసం ఒక వినూత్న వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఇటీవల ఆ ప్రాజెక్టు రూపొందించిన శుభ శ్రీ జపాన్౼ఆసియా యువ విజ్ఞాన మార్పిడి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుభ శ్రీ ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పాఠశాల ఛైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు.
News March 26, 2025
మెగాస్టార్-అనిల్ సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కే సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిని వినోదభరితమైన చిత్రంగా రూపొందిస్తారని పేర్కొన్నాయి. కాగా ఇప్పటికే చిరు ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసుకోగా, మే 9న విడుదల కానుంది. ఇక అనిల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.