News April 29, 2024

బాపట్ల జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఇదే..

image

బాపట్ల జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి 151 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, చివరగా 104 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. బాపట్ల పార్లమెంటు నుంచి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. అసెంబ్లీల వారీగా వేమూరు 15, రేపల్లె 14, బాపట్ల 15, పర్చూరు 15, అద్దంకి 15, చీరాల 15 మంది అభ్యర్థులు రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 4, 2024

కూతురు పుట్టిందన్న ఆనందం.. అంతలోనే విషాదం.!

image

సత్తెనపల్లిలో ఆదివారం రాత్రి వెన్నాదేవి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు యడ్లపాడు మండలం లింగారావుపాలెంకు చెందిన రోశయ్య(32)కు వివాహం అయిన నాలుగేళ్లకు కుమార్తె పుట్టింది. ఆనందంతో తన బంధువైన వీరేంద్రతో కలిసి కుమార్తెను చూసి వస్తుండగా గుంటూరు-పిడుగురాళ్ల మధ్యమార్గంలో వారు వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 

News November 4, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం సీఆర్డీఏపై సమీక్ష చేసి స్పోర్ట్స్ పాలసీపై రివ్యూ చేస్తారు. సాయంత్రం వ్యవసాయ పశుసంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 4, 2024

గుంటూరులో నడిరోడ్డుపై కత్తితో వీరంగం

image

గుంటూరులో రుణం తిరిగి చెల్లించే విషయంలో కొందరు వ్యక్తులు కత్తులు, రాళ్లతో బీభత్సం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తాను ఇచ్చిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదని సుబ్రహ్మణ్యేశ్వర రావును నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి తమ అనుచరులను పిలుచుకొని ఒకరినొకరు కార్లతో గుద్దుకొని భయభ్రాంతులకు గురిచేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.