News March 6, 2025
బాపట్ల జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

బాపట్ల జిల్లాలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో గురువారం 39డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృతలూరు, కొల్లూరు, వేమూరు, చుండూరు, చిన్నగంజాం, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యుంది. వేడిగాలులు వీస్తుండడంతో ఇంటర్, 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News November 25, 2025
నిర్మల్: నిరుద్యోగులకు ఉచిత సోలార్ శిక్షణ

సూర్యమిత్ర కోర్సులో భాగంగా నిర్మల్లోని రాజీవ్ గాంధీ ఐటీఐలో ఉచిత సోలార్ శిక్షణ అందించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ అమిత్ దేశ్ పాండే తెలిపారు. 90 రోజుల పాటు ఉచిత రెసిడెన్షియల్, శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు కలిగి ఐటీఐ లేదా డిప్లమా పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
News November 25, 2025
మహిళా సంఘాలకు రూ.19.27 కోట్లు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలోని 19,670 మహిళా స్వయం సహాయక సంఘాలకు నేడు రూ.19.27 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిర నియోజకవర్గంలో 4,782 సంఘాలకు రూ.4.99 కోట్లు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ఈ పథకాన్ని పునరుద్ధరించిందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News November 25, 2025
నేడే వడ్డీ లేని రుణాల పంపిణీ.. టాప్లో నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీలో భాగంగా, మూడో విడత కార్యక్రమం నేడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగనుంది. రాష్ట్రంలోని 3.50 లక్షల సంఘాలకు రూ.304 కోట్లు విడుదల చేయగా, నల్గొండ జిల్లాకు అత్యధికంగా రూ. 26.34 కోట్ల రుణాలు కేటాయించారు.


