News March 6, 2025
బాపట్ల జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు

బాపట్ల జిల్లాలో మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో గురువారం 39డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృతలూరు, కొల్లూరు, వేమూరు, చుండూరు, చిన్నగంజాం, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో 39డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యుంది. వేడిగాలులు వీస్తుండడంతో ఇంటర్, 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News March 27, 2025
శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
News March 27, 2025
మందమర్రి: రెండు లారీలు ఢీ.. ఒకరికి గాయాలు

మందమర్రి సమీపంలోని సోమగూడెం హైవేపై తెల్లవారుజామున రెండు లారీలు ఒకటి వెనుక ఒకటి ఢీకొనగా వెనుక లారీ క్యాబిన్లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గంటల నుంచి గాయపడ్డ వ్యక్తి బయటికి రావడానికి నానా యాతన పడుతున్నాడు. విషయం తెలుసుకున్న108 సిబ్బంది, పోలీస్ శాఖ, హైవే సిబ్బంది అక్కడి చేరుకొని క్షతగాడ్రుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
News March 27, 2025
భగభాన్ పాలైకి 10ఏళ్ల జైలు శిక్ష విధించిన గుంతకల్ కోర్టు

ఒడిశా రాష్ట్రానికి చెందిన భగభాన్ పాలై అనే వ్యక్తికి గుంతకల్ కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో గుంతకల్లు రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తూ రైల్వే పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా ముద్దాయికి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.