News January 25, 2025

బాపట్ల జిల్లాలో మరో 12 మద్యం దుకాణాలు

image

గీత కులాలకు రిజర్వు చేసిన 12 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రకటించారు. గీత, గౌడ కులాలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ లాటరీ పద్ధతిలో బాపట్ల జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని కలెక్టర్ చెప్పారు.

Similar News

News October 22, 2025

కన్నుల పండువగా కురుమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం

image

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.

News October 22, 2025

‘పేరు వల్లే’ సర్ఫరాజ్‌ సెలక్ట్ కాలేదా: షమా

image

సౌతాఫ్రికా-Aతో పంత్ సారథ్యంలో ఆడనున్న టీమ్ ఇండియా-A జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఖాన్ అనే ఇంటిపేరు వల్లే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదా? జస్ట్ ఆస్కింగ్. ఇలాంటి విషయంలో గంభీర్ ఎలా వ్యవహరిస్తారో మనకు తెలుసు’ అని AICC అధికార ప్రతినిధి షమా మహ్మద్ ట్వీట్ చేశారు. టీమ్ ఇండియాని కాంగ్రెస్ మతం పేరుతో వేరు చేయాలని చూస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

News October 22, 2025

AP న్యూస్ రౌండప్

image

*పాయకరావుపేట నియోజకవర్గంలోనే లక్ష ఉద్యోగాలిస్తాం: హోంమంత్రి అనిత
*కూలిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
*కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉగ్రవాది అబూబకర్‌ సిద్ధికి భార్య సైరాబానును కస్టడీకి తీసుకుని VJA తరలించిన NIA అధికారులు
*గుంటూరు(D) ఇటికంపాడు రోడ్డు శివారులో పిడుగుపాటుకు మరియమ్మ(45), షేక్ ముజాహిద(45) అక్కడికక్కడే మృతి