News March 31, 2025
బాపట్ల జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

బాపట్ల జిల్లాలో రంజాన్ సందడి మొదలైంది. ముస్లింల పరమ పవిత్రమైన రంజాన్ రోజు మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. ప్రజలు భారీ సంఖ్యలో మాంసం విక్రయం కోసం బారులు తీరారు. కాగా జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ధరలు అటూ ఇటుగా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి KG రూ.280 ఉండగా.. మటన్ కిలో ధర 800, నాటుకోడి ధర KG రూ.500గా ఉంది. నిన్న బాపట్ల సహా పలు ప్రాంతాల్లో KG రూ.180 ఉన్న చికెన్ ధర నేడు అమాంతం రూ.100కు పెరిగింది.
Similar News
News November 16, 2025
పుట్ట మధుకు CBI పిలుపు.. మంథని బీఆర్ఎస్లో టెన్షన్

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారణకు రావలసిందిగా పుట్ట మధును CBI పిలవడంతో మంథని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. హత్యలో పుట్ట మధు ప్రమేయం ఉన్నట్లు తేలితే మంథనిలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. గత నెల రోజులుగా పెద్దపల్లిలో తిష్ట వేసిన CBI ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్నవారందరినీ ఇప్పటికే విచారించింది.
News November 16, 2025
సిద్దిపేట: కొండెక్కిన కోడి కూర ధర!

కార్తీక మాసంలో కూడా చికెన్ ధరలు మండిపోతున్నాయి. జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 220 నుంచి రూ.240 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ.260 నుంచి రూ.270 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ.20 వరకు పెరిగింది. సిద్దిపేట మార్కెట్లో నాటుకోడి ధర కూడా కిలో రూ.500 పైనే పలుకుతుంది. ధరలు పెరగడంతో మాంస ప్రియులు నిట్టూరుస్తున్నారు.
News November 16, 2025
APPY NOW: జమ్మూ సెంట్రల్ వర్సిటీలో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో 5 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికే ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్సైట్: https://cujammu.ac.in/


