News March 31, 2025

బాపట్ల జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

image

బాపట్ల జిల్లాలో రంజాన్ సందడి మొదలైంది. ముస్లింల పరమ పవిత్రమైన రంజాన్ రోజు మాంసం దుకాణాలు కిటకిటలాడాయి. ప్రజలు భారీ సంఖ్యలో మాంసం విక్రయం కోసం బారులు తీరారు. కాగా జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ధరలు అటూ ఇటుగా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి KG రూ.280 ఉండగా.. మటన్ కిలో ధర 800, నాటుకోడి ధర KG రూ.500గా ఉంది. నిన్న బాపట్ల సహా పలు ప్రాంతాల్లో KG రూ.180 ఉన్న చికెన్ ధర నేడు అమాంతం రూ.100కు పెరిగింది.

Similar News

News April 23, 2025

గార్ల మండలానికి చెందిన నిహారికకు రాష్ట్రస్థాయి ర్యాంక్

image

గార్ల మండలానికి చెందిన శీలం శెట్టి నిహారిక మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో 1000కి 988(బైపీసీ) మార్కులు సాధించిందని ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న నిహారిక.. చదువులో రాణించడంతో పలువురు అభినందనలు తెలిపారు. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.

News April 23, 2025

అదానీ స్పెక్ట్రమ్‌తో ఎయిర్‌టెల్ డీల్

image

అదానీ డేటా నెట్‌వర్క్స్‌ 26GHz బ్యాండ్‌లోని 400 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వాడుకునేందుకు ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.212 కోట్లు చెల్లించింది. గుజరాత్, ముంబై, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులోని స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ వినియోగించుకుంటుంది. దీనివల్ల 5G వేగం, నెట్‌వర్క్ కెపాసిటీ పెరగనుంది. యూజర్లకు నాణ్యమైన సేవలు అందుతాయి.

News April 23, 2025

HYD: తెలంగాణ పోలీస్ క్రీడాకారులకు 18 పతకాలు

image

కొచ్చిలో జరిగిన తొలి అఖిల భారత పోలీస్ బ్యాడ్మింటన్ క్లస్టర్ టోర్నీలో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ చూపారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీపడి12 మంది అధికారులు మొత్తం 18 పతకాలు గెలుచుకున్నారు. వాటిలో 2 బంగారు, 2 వెండి, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. వీరిని డీజీపీ జితేందర్ అభినందించారు. ఈ విజయం పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు.

error: Content is protected !!