News March 27, 2025
బాపట్ల జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు

బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలలో నిషేధిత వస్తువులు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News December 30, 2025
మేడారంలోనే ఎస్పీ కేకన్ అడ్డా

మేడారం జాతరలోనే జిల్లా అధికారులు మకాం పెట్టారు. ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్ స్వయంగా మేడారంలోనే తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎస్పీ, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రోడ్ల మరమ్మతు జరుగుతుండటంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరగకుండా పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా, వణుకుతూనే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
News December 30, 2025
చిత్తూరులో భారీ స్కాం.. ఆ లైసెన్సులు రద్దు!

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన చిత్తూరు జిల్లా GST స్కాంలో జిల్లాకు చెందిన ఏడు పరిశ్రమల లైసెన్సులు రద్దయినట్లు తెలుస్తోంది. వీటిలో హరి ఓం ట్రేడర్స్, హేమ స్టీల్స్, సంతోష్ కాంట్రాక్ట్ వర్క్స్, సాయి కృష్ణ కాంట్రాక్ట్ వర్క్స్, పెద్ద మస్తాన్ ఎంటర్ప్రైజెస్ ఉన్నట్లు సమాచారం. GST స్కాంపై అధికారులు గుట్టుచప్పుడు కాకుండా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ జాబితాలోకి మరికొన్ని సంస్థలు చేరనున్నాయి.
News December 30, 2025
KNR: జర్మనీలో ఉంటోన్న మాజీ MLAకు ఇప్పటికీ పెన్షన్

సిటిజన్షిప్ యాక్ట్ 1995 సెక్షన్ 10 కింద వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జర్మనీలో ఉంటున్న చెన్నమనేనికి ఇప్పటికీ అసెంబ్లీ నుంచి పెన్షన్ అమౌంట్ ఆయన బ్యాంక్ ఖాతాలో జమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆది శ్రీనివాస్ అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా పెన్షన్ ఆగకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.


