News March 26, 2025

బాపట్ల జిల్లాలో యువ రైతు ఆత్మహత్య

image

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో అప్పులు బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు బ్రహ్మయ్య వ్యవసాయంలో భారీగా అప్పులు కావడంతో, గ్రామంలోని పంట పొలాల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకొని ఉదయాన్నే పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలకు తరలించారు.

Similar News

News November 23, 2025

యథావిధిగా అమలాపురంలో ‘పీజీఆర్‌ఎస్‌’ : కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 24 సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, అలాగే ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు.

News November 23, 2025

KMR: రైలు ఢీకొని 80 గొర్రెల మృతి.. కాపరి గల్లంతు

image

కామారెడ్డి రైల్వే ట్రాక్ సమీపంలో ఆదివారం రైలు ఢీకొని సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. రైలు రాకను గమనించి వాటిని కాపాడుకునే ప్రయత్నంలో గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి, 35 ఏళ్ల ధర్షపు సుధాకర్, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు. సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

సిరిసిల్ల డీఎస్పీగా నాగేంద్ర చారి నియామకం

image

సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే.నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.