News March 26, 2025
బాపట్ల జిల్లాలో యువ రైతు ఆత్మహత్య

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో అప్పులు బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువ రైతు బ్రహ్మయ్య వ్యవసాయంలో భారీగా అప్పులు కావడంతో, గ్రామంలోని పంట పొలాల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకొని ఉదయాన్నే పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలకు తరలించారు.
Similar News
News October 20, 2025
ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్లిపోతే?.. కర్ణాటక ప్రభుత్వంపై కుమారస్వామి ఫైర్

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైరయ్యారు. పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ‘ఇన్ఫోసిస్ <<18031642>>నారాయణమూర్తి<<>>, సుధామూర్తి దంపతులను అవమానించేలా సీఎం సిద్దరామయ్య మాట్లాడటం దారుణం. ఒకవేళ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ఏపీకి మారిస్తే పరిస్థితి ఏంటి? ‘మీ అవసరం మాకు లేదు’ అన్నట్లు వ్యవహరించడం రాష్ట్రానికే నష్టం’ అని వ్యాఖ్యానించారు.
News October 20, 2025
భద్రాచలంలో గ్యాంగ్ వార్ కలకలం..!

భద్రాచలం పట్టణంలో గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి పాత మార్కెట్ వద్ద యువకులు ఘర్షణకు దిగారు. ఈ దాడిలో జగదీష్ నగర్ కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News October 20, 2025
WGL: దీపావళి.. ‘B New’లో స్పెషల్ ఆఫర్లు

దీపావళి సందర్భంగా B New మొబైల్స్ & ఎలక్ట్రానిక్స్ స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్పై వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్లు ‘B New’ సంస్థ CMD వై.డి.బాలాజీ చౌదరి, CEO సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 150కిపైగా స్టోర్లతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరలు ఉన్నట్లు బాలాజీ చౌదరి వెల్లడించారు.