News March 27, 2025
బాపట్ల జిల్లాలో రాత్రి సమయంలో గస్తీ

బాపట్ల జిల్లా పోలీసులు సమర్థవంతంగా రాత్రి పూట గస్తీ విధులు నిర్వహిస్తున్నారని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి బుధవారం తెలిపారు. ప్రధాన ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఏటీఎంలు, బ్యాంకులు ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్నారు. గస్తీ నిర్వహించే సిబ్బంది విధులలో అధునాతన సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు తారస పడితే వారిని విచారిస్తున్నారని చెప్పారు.
Similar News
News November 19, 2025
ASF వయోవృద్ధుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్

తల్లిదండ్రులను సరిగా పోషించని బిడ్డలపై ఇప్పటి వరకు ASF జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567లో సంప్రదించవచ్చని సూచించారు.
News November 19, 2025
విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.
News November 19, 2025
పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


