News April 15, 2025
బాపట్ల జిల్లాలో లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు

బాపట్ల జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జీలు, రిసార్ట్లు, దాబాలలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. క్రికెట్ బెట్టింగులు అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతను క్రికెట్ బెట్టింగ్‌కు ప్రోత్సహిస్తే సహించేది లేదని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
మంచిర్యాల: ‘వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి’

వరి ధాన్యం కొనుగోలు కొరకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో, 97 డీసీఎంఎస్ ఆధ్వర్యంలో, 63 మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రేడ్ ఏకు క్వింటాల్‌కు రూ.2,369, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు.
News November 4, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు అసంబద్ధం: YS జగన్

కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఒక్క రోజులోనే సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. 31 తర్వాత దరఖాస్తుకు కూడా అవకాశం లేదు. ఒక్కరోజులో పంట పొలాల్లోకి వచ్చి ఎన్యూమరేషన్ చేయటం అసాధ్యం అని జగన్ విమర్శించారు. అసలు ఎన్యూమరేషన్ అంటే చంద్రబాబుకు తెలుసో లేదో తెలుసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
News November 4, 2025
లక్షెట్టిపేట: మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు: కలెక్టర్

మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, ఏఎంసీ ఛైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ ఛైర్మన్ ఎండీ ఆరిఫ్, తహశీల్దార్ దిలీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలమెల రాజు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పింగళి రమేశ్ ఉన్నారు.


